గాయానికి కుట్లకు బదులు ఓ నర్సు పెవిక్విక్ వేసిన ఘటన కర్ణాటకలోని హవేరి(D) అడూర్ PHCలో చోటు చేసుకుంది. గత నెల 14న ఏడేళ్ల బాలుడి చెంపపై లోతైన గాయమైంది. పేరెంట్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. విధుల్లో ఉన్న నర్సు జ్యోతి ప్రథమ చికిత్స అందించింది. తల్లిదండ్రులు వద్దు అని వారిస్తున్నా.. కుట్లు వేస్తే మచ్చ వస్తుందని పెవిక్విక్ వేసి, దానిపై బ్యాండెజ్ వేసి పంపించింది. దీనిపై స్పందించిన DHO ఆమెను సస్పెండ్ చేశారు.