దారుణం.. బతికుండగానే కన్న తండ్రిని కాలువలో పడేసిన కుమారుడు

63చూసినవారు
దారుణం.. బతికుండగానే కన్న తండ్రిని కాలువలో పడేసిన కుమారుడు
AP: పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నూజెండ్లకు చెందిన గంగినేని వెంకటేశ్వర్లు తన తండ్రి కొండయ్య(85)ను బద్రుపాలెం వంతెనపై నుంచి సాగర్‌ కాలువలో పడేశాడు. ఈ ఘటన చూసిన గ్రామస్థులు వృద్ధుడిని కాపాడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వృద్ధుడిని కాలువలో పడేసిన అనంతరం కారులో పరారవుతున్న వెంకటేశ్వర్లును గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేసి చెట్టుకు కట్టారు. మృతదేహాన్ని PM కోసం వినుకొండ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్