TG: సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. భర్త కళ్లముందే ఆమె భార్యపై అత్యాచారం చేసిన ఘటన ఈ నెల 14న జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని ఓ తండాకు చెందిన దంపతులు సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా అనంతపురానికి కాలినడకన వెళ్లి వస్తూ ఫసల్‌వాదిలోని ఓ విద్యాపీఠంలో రాత్రి నిద్రపోయారు. ఈ క్రమంలో అక్కడే పెయింటింగ్ పనులు చేస్తున్న మాథవన్ (34) అనే వ్యక్తి ఆమె భర్తపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.