ఐపీఎల్ 2025లో భాగంగా చెపాక్ వేదికగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్‌లో ఈ ఇరు జట్లు ఇప్పటివరకు మొత్తం 29 సార్లు తలపడగా.. అందులో CSKదే పైచేయిగా ఉంది. మొత్తం 19 మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ 10 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. చెపాక్‌లో ఈ ఇరు జట్లు 11 సార్లు తలపడగా.. CSK 8, కేకేఆర్ 3 మ్యాచ్‌లు గెలిచాయి.