డబ్ల్యూటీసీ 2025 ఛాంపియన్స్‌గా సౌతాఫ్రికా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఓటమికి కారణం కమిన్స్ కెప్టెన్సీ అని దిగ్గజ క్రికెటర్లు మాథ్యూ హెడెన్, డేల్ స్టెయిన్ అన్నారు. ‘ ఫీల్డ్ సెటప్ విషయంలో ఆసీస్ తప్పిదం చేసింది. అటాకింగ్ కాకుండా డిఫెన్సివ్ ఫీల్డింగ్ చేసి మూల్యం చెల్లించుకుంది. ఓపెనర్లు ఔట్ అయ్యాక బవుమాపై ఒత్తిడి తేవాల్సింది’ అని విమర్శించారు.