కరెంట్ అఫైర్స్: వార్తల్లో వ్యక్తులు

278చూసినవారు
కరెంట్ అఫైర్స్: వార్తల్లో వ్యక్తులు
• దర్శకధీరుడు రాజమౌళి 2023కు ప్రఖ్యాత టైమ్ మేగజైన్ విడుదల చేసిన 100 మంది ప్రపంచవ్యాప్త ప్రభావశీలుర జాబితాలో చోటు దక్కించుకున్నారు. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, రచయిత సల్మాన్ రష్దీ, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
• ఛత్తీస్ గఢ్ దుర్గ్ జిల్లాలోని పురాయి గ్రామానికి చెందిన 15 ఏళ్ల చంద్రకళ ఓజా 8 గంటలు నిర్విరామంగా ఈతకొట్టి ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సంపాదించారు.
• ఏపీ సీఎం వైఎస్ జగన్ రూ.510 కోట్ల ఆస్తులతో దేశంలో అత్యంత ధనిక సీఎంగా నిలిచారు.
Job Suitcase

Jobs near you