తెలంగాణ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శాంతినగర్‌కు చెందిన ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.13.58 లక్షలు కాజేశారు. ట్రేడింగ్‌లో అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి ఉద్యోగిని మోసగించిన సైబర్ నేరగాళ్లు ఆశ చూపి లక్షలు దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ట్రేడింగ్‌లో పేరిట అధికలాభాలు వస్తాయని ఎవరైనా ఆశ చూపితే గుడ్డిగా నమ్మి మోసపోవద్దని పోలీసులు చెబుతున్నారు.