సైబర్‌ క్రైమ్‌ బాధితులకు సత్వర న్యాయం అందాలి: కేటీఆర్‌

65చూసినవారు
సైబర్‌ క్రైమ్‌ బాధితులకు సత్వర న్యాయం అందాలి: కేటీఆర్‌
తెలంగాణ శాసనసభలో సివిల్‌ కోర్టుల సవరణ బిల్లును మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 'సైబర్‌ క్రైమ్‌ బాధితులకు సత్వర న్యాయం అందాలి. సైబర్‌ క్రైమ్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు త్వరగా భర్తీ చేయాలి. కేంద్ర చట్టాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి చెప్పాలి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే చట్టాలు తేవడం మంచిది కాదు. అత్యాచారాలు చేసిన వారికి త్వరగా శిక్షపడాలి' అని అన్నారు.

సంబంధిత పోస్ట్