ఫెంగల్ తుఫాన్ కారణంగా చెన్నైలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో చెన్నై - 56వ వార్డు మన్నాడి ప్రకాశంలో ఓ యువకుడు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. వర్షం కారణంగా ఏటీఎం సమీపంలో తెగిపడిన లోహపు తీగను తొక్కడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.