తిరుమల శ్రీవారిని ‘డాకు మహారాజ్’'డాకు మహారాజ్' బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ దర్శించుకున్నారు. ఆదివారం సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. దర్శనం అనంతరం ఆమెకు వేద పండితులు రంగనాయక మండపంలో ప్రత్యేక ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.