ఇ-కామర్స్ సైట్లలో డార్క్ పాటర్న్స్ అనేవి కొనుగోలుదారులను మోసం చేసే టెక్నిక్స్. ఉదాహరణకు, రూ.150 వస్తువుపై రూ.100 కూపన్ ఆఫర్ చూపించి, చివరికి రూ.80-90 వసూలు చేస్తారు. ఇది తక్కువ ధర అని భ్రమింపజేస్తుంది. అవసరం లేని వస్తువులను కొనిపిస్తాయి. దాచిన ఛార్జీలు, తప్పుడు డిస్కౌంట్లు, సబ్‌స్క్రిప్షన్ ట్రాప్‌లు ఇందులో ఉంటాయి. ఇవి మన జేబుకు చిల్లు పెడతాయి. కొనే ముందు జాగ్రత్తగా చూడాలి.