నానాటికీ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిర దర్శన వేళలను గంటన్నర పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే సాధారణ దర్శనాన్ని ఇకపై గంట ముందుగా అంటే ఉదయం 6 గంటల నుంచే కల్పిస్తామని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. రాత్రి 9.30 గంటలవరకు ఉన్న దర్శన వేళలను 10 గంటలవరకూ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.