TG: శాసన మండలిలో దాసోజు శ్రవణ్ కుమార్ ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దాసోజుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్, హరీష్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు హాజరయ్యారు. ఇదివరకే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నప్పటికీ పలు కారణాలతో వాయిదా పడింది. మార్చి 30న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా దాసోజు ఎన్నికయ్యారు.