గుజరాత్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ పై ఆ జట్టు స్టార్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ ప్రశంసలు కురిపించాడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ జట్టును అద్భుతంగా నడిపించే సత్తా అతడికి ఉందని వ్యాఖ్యానించాడు. ప్రస్తుత సీజన్ లో తమ జట్టు ప్రదర్శన గొప్పగా లేదని.. చాలా మ్యాచుల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలవడం నిరాశకు గురి చేసిందని తెలిపాడు.