TG: ఇటీవల ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి.. పెట్టుబడులపై భారీగా ఒప్పందాలు చేసుకున్నట్లు వెల్లడించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ దాదాపు రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులను దావోస్ సదస్సులో ఆకర్షించాం. మా ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఈ ఒప్పందాలు అతి పెద్దది. ఈ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచుతూ అంతర్జాతీయ సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి’’ అని ఆయన తెలిపారు.