TG: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దయాకర్ రావు ఏదీ పడితే అది మాట్లాడితే బాగుండదని, వయస్సుతో పాటు హుందాతనాన్ని కాపాడుకోవాలని యశస్విని రెడ్డి అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి విషయంలో తనకో విజన్ ఉందని ఆమె తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సత్తా ఏంటో లోకల్ బాడీ ఎన్నికల్లో చూపిస్తామని అన్నారు.