మరింత పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు

59చూసినవారు
మరింత పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లో వేసవి రాకముందే ఎండలు భగభగ మండిపోతున్నాయి. TGలో వచ్చే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2–5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35-37 డిగ్రీల మధ్య నమోదైనట్లు పేర్కొంది. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 37.7 డిగ్రీలు, కొత్తగూడెంలో 37.6 డిగ్రీలు రికార్డు అయింది. అటు ఏపీలోనూ పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. కర్నూలులో 36.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

సంబంధిత పోస్ట్