9 నెలల తర్వాత బయటపడ్డ సైనికుల మృతదేహాలు (వీడియో)

71చూసినవారు
లడఖ్‌లో హిమపాతం బారిన పడిన ముగ్గురు భారత సైనికుల మృతదేహాలు 9 నెలల తర్వాత లభ్యమయ్యాయి. 18,700 అడుగుల ఎత్తులో 9 రోజుల పాటు 10-12 గంటల పాటు తవ్వకాలు జరిపారు. సుమారు 1 టన్ను మంచును తొలగించిన తరువాత, సైనికుల మృతదేహాలను బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సైనికులకు కామెంట్స్ ద్వారా సంతాపం తెలుపుతున్నారు.

సంబంధిత పోస్ట్