క్యాన్సర్.. ఈ పేరు వింటేనే గుండెలో గుబులు పుడుతోంది. ఎందుకంటే ఈ వ్యాధి ఒక్కసారి సోకితే అంత త్వరగా వదిలిపెట్టదు. అయితే క్యాన్సర్‌లలో అనేక రకాలు ఉంటాయి. వాటిలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకటి. ప్రోస్టేట్ క్యాన్సర్ పురుషులలో మూత్రాశయం క్రింద ఉన్న ప్రోస్టేట్ గ్రంథిలో ఏర్పడే ప్రాణాంతక వ్యాధి. 50 ఏళ్లు పైబడిన వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు తాజాగా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.