జాహ్నవి కందుల మృతి.. ఆ అధికారి ఉద్యోగం తొలగింపు

62చూసినవారు
జాహ్నవి కందుల మృతి.. ఆ అధికారి ఉద్యోగం తొలగింపు
అమెరికాలోని సియాటెల్‌లో ఏపీకి చెందిన జాహ్నవి కందుల(23) 2023 జనవరిలో పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై పోలీసు అధికారి డేనియల్ అడెరెర్..'ఆమె ఓ సాధారణ వ్యక్తి. ఈ మరణానికి విలువలేదు' అని చులకనగా మాట్లాడిన ఓ వీడియో ఆ మధ్య వైరల్ అయ్యింది. దీంతో భారత ప్రభుత్వం సైతం ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయగా, అప్పట్లో సస్పెండ్ చేశారు. తాజాగా అతణ్ని ఉద్యోగం నుంచి పూర్తి తొలగించారు.

సంబంధిత పోస్ట్