తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై సభలో చర్చ కొనసాగుతోంది. సభలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మధ్యలోనే వదిలేశారన్నారు. భూమిలేని రైతులకు తమ ప్రభుత్వం 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా'తో సాయం అందిస్తోందన్నారు.