TG: రాష్ట్రంలో రెండేళ్ల డీఈడీలో ప్రవేశానికి నిర్వహించే ‘డీఈఈసెట్-2025’కు దరఖాస్తు గడువు నేటి (గురువారం) అర్ధరాత్రితో ముగియనుంది. మంగళవారం నాటికి 38 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత అత్యధికంగా 2018లో 32,783 దరఖాస్తులు రాగా.. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగింది. దరఖాస్తుకు ఒక రోజు గడువు ఉన్నందున దరఖాస్తుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ నెల 25న పరీక్ష నిర్వహించనున్నారు.