తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఏపీలోని కాకినాడ వీరవరంలో నిమజ్జనం చేస్తుండగా ప్రమావదశాత్తు ఓ యువకుడు కాలువలో పడి మృతిచెందాడు. స్థానికులు యువకుడిని లక్ష్మణ్ గా గుర్తించారు. మరో వైపు మేడ్చల్ లోని రాజొల్లారం తండాలో వినాయక విగ్రహం మీద పడటంతో ట్రాక్టర్ డ్రైవర్ చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.