HYDలో జరిగిన యువతి దీప్తి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులు సంగీతరావు, అనిత, ఆమె తండ్రి సోమయ్యను అరెస్టు అయ్యారు. నిందితులను నాచారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అనిత భర్త అనిల్ (కానిస్టేబుల్), సైదులు పరారీలో ఉన్నట్టు తెలిపారు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్యోగం ఇప్పిస్తానని తండ్రి తీసుకున్న డబ్బు తిరిగివ్వాలని వేధించడంతో ఐఐసీటీ పీహెచ్‌డీ స్కాలర్ దీప్తి మనస్తాపానికి గురై శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.