IPL-2025లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఢిల్లీ స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ 15 పరుగులకు ఔట్ అయ్యారు. కర్ణశర్మ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి రాహుల్ వెనుదిరిగారు. వరుసగా వికెట్లు కోల్పోయి ఢిల్లీ జట్టు ఓటమి దిశగా సాగుతోంది. 16 ఓవర్లకి DC స్కోర్ 164/6గా ఉంది. ప్రస్తుతం క్రీజులో అశుతోష్(5), విప్రాజ్(2) ఉన్నారు.