IPL-2025లో భాగంగా లక్నో వేదికగా మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలవ్వనుంది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టును ఫస్ట్ బ్యాటింగ్ చేసేందుకు ఆహ్వానించారు. లక్నో పిచ్ ఛేజింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ క్రమంలో ఢిల్లీ బౌలింగ్‌ను ఎంచుకుంది.