దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలల్లో ఫీజులను ఇటీవల భారీగా పెంచేశారు. పాఠశాలల్లో ఫీజుల పెంపును నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలు కూడా చేపట్టారు. ఈ క్రమంలో పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు పెంచడాన్ని సీఎం రేఖా శర్మ తప్పుబట్టారు. ఏకపక్షంగా ఫీజుల పెంచితే సహించేది లేదని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకొని ఆయా పాఠశాలల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని హెచ్చరించారు.