ఢిల్లీ సీఎం పేరును బీజేపీ సోమవారం ప్రకటించనున్నట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కలిసి సీఎం పేరును ఖరారు చేయనున్నారు. ఇక ఫిబ్రవరి 19న నూతన సీఎం ప్రమాణస్వీకారం జరిగే అవకాశం ఉంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు 48 స్థానాలను బీజేపీ గెలుచుకుంది.