ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో BJP ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీఎం ఎవరిని ఎంపిక చేస్తుందా, ప్రమాణస్వీకారం ఎప్పుడు ఉంటుందా అనే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ప్రధాని మోడీ ఈ నెల 10 నుంచి ఫ్రాన్స్, అమెరికా పర్యటనలకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. 12, 13 తేదీల్లో పర్యటనను ముగించుకొని తిరిగి వచ్చాకనే ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.