దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. అనంతరం ఉదయం 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఆ క్రమంలో తొలుత పోస్టల్ బ్యాలెట్స్ ను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలో నమోదు అయిన ఓట్లను లెక్కిస్తారు. ఢిల్లీ అధికార పీఠాన్ని ఎవరు కైవసం చేసుకంటారనేది మధ్యాహ్నానానికి తెలిసి పోనుంది.