ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల సమయానికి 58% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వనున్నారు. ఢిల్లీలో ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ఈ సారి భారీ పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ ప్రజలు ఎవరికి పట్టం కట్టారో ఫిబ్రవరి 8న తేలనుంది.