ఢిల్లీలో ప్రస్తుతం ‘3జీ’ ప్రభుత్వం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. 3జీ అంటే.. మోసపూరిత ప్రభుత్వం, చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించే ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం అని అమిత్ షా అభివర్ణించారు. ఈ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఆప్‌ను చీపురుతో ఊడ్చేసి తరుముతారని జోస్యం చెప్పారు. తమ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ‘వేవ్’ గురించి ఆప్ నాయకులకు తెలుసన్నారు.