ఢిల్లీ రావూస్ సెంటర్‌ సహ యజమానులకు బెయిల్‌

60చూసినవారు
ఢిల్లీ రావూస్ సెంటర్‌ సహ యజమానులకు బెయిల్‌
దేశ రాజధాని ఢిల్లీలోని రావూస్‌ సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌లోకి 2024 జులై 27న చొచ్చుకొచ్చిన వరదలో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై నమోదైన కేసులో భవనం బేస్‌మెంట్‌ సహ యజమానులకు ఢిల్లీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ‘ఇందులో ఎలాంటి అవినీతి కోణం లేదు. ఈ కేసుపై ఇప్పటికే ఛార్జిషీట్‌ నమోదైంది. అందుకే 2024 సెప్టెంబరు 13న వీరికి మంజూరైన మధ్యంతర బెయిల్‌ను రెగ్యులర్‌ బెయిల్‌గా మార్పు చేస్తున్నాం’ అని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్