కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు గుప్పించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం రాహుల్‌గాంధీ కృషి చేశారని విమర్శించారు. ఈ మేరకు కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కంగ్రాట్స్ రాహుల్ గాంధీ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీజేపీని గెలిపించిన రాహుల్‌కి కంగ్రాట్స్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో కేటీఆర్ పై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు.