ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే నేడు విడుదలైన ఫలితాల్లో అత్యల్ప మెజారిటీ గెలుపును కూడా బీజేపీనే కైవసం చేసుకుంది. సంగం విహార్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి చందన్ కుమార్ చౌదరి కేవలం 344 ఓట్ల అత్యల్ప మెజారిటీతో గెలుపొందారు. కాగా, అత్యధికంగా 42,724 ఓట్ల మెజారిటీతో మతియా మహల్ నుంచి ఆప్ అభ్యర్థి ఆలే మొహమ్మద్ ఇక్బాల్ గెలుపొందారు.