బతుకమ్మ సంబురాలు బుధవారం ప్రారంభం కాగా.. సద్దుల బతుకమ్మను ఈ నెల 10న జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో 10న ప్రభుత్వం అధికారిక సెలవు ఇవ్వాలని తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ కోరింది. మహిళలు ఎంతో పవిత్రంగా జరుపుకునే ఈ రోజున ఆప్షనల్ హాలిడే కాకుండా రెగ్యులర్ సెలవు ఇవ్వాలని కోరింది. సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చింది. దీనిపై స్పందిస్తే ప్రభుత్వ కార్యాలయాలకు ఈ నెల 10న సెలవు ఉండనుంది.