కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని బలహీన పరిచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 'రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే పనిలో మన కేంద్రం ఉంది. ఇది దేశ చరిత్రలోనే తొలిసారి. ప్రస్తుతం మనం చేస్తున్న పోరాటం మన సొంత రాజకీయాల కోసం కాదు. దేశ రక్షణ కోసమని మీరు గుర్తుంచుకోవాలి' అని పేర్కొన్నారు.