TG: నాగర్ కర్నూల్ జిల్లా చారకొండలో ఇవాళ ఉద్రిక్తత చోటుచేసుకున్నది. బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం జడ్చర్ల- కోదాడ జాతీయ రహదారిపై 29 ఇళ్లను 400 మంది పోలీస్‌ల సహకారంతో రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. గ్రామం మధ్య నుంచి బైపాస్ తీసుకెళ్లడంపై స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగినవారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేయడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.