ఇళ్ల కూల్చివేతలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న చిన్నారుల దృశ్యాలు

59చూసినవారు
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా చేపట్టిన కూల్చివేతలు వివాదాస్పదం అవుతున్నాయి. తాజాగా మూసీ ప్రాంతాల్లో అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే శంకర్ నగర్ లోని ఓ కూలిపోయిన ఇంటి శిథిలాల్లో చిన్నారులు ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. తమ ఇళ్లు ఎందుకు కూలిపోయిందో తెలియని అమాయక పిల్లలు ఆ శిథిలాలతోనే మళ్లీ ఇల్లు కట్టుకోవడం హృదయాల్ని కదిలిస్తోంది.

సంబంధిత పోస్ట్