TG: మాదాపూర్‌లోని సున్నం చెరువు వద్ద అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైకోర్టు సీరియస్ అయింది. అక్రమ నిర్మాణాలు కూల్చడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందని, ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదా? అంటూ హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ చేపట్టింది. సున్నం చెరువు పునరుద్ధరణకు అనుమతి కోరుతూ హైకోర్టుకు దరఖాస్తు చేయాలని, అప్పటివరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది.