TG: ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలపై BRS మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. మాపై విమర్శలు చేయడంపై ఉన్న దృష్టి అన్నదాతల జీవితాల మీద లేదని విమర్శించారు. 'తడిసిన ప్రతి గింజను వెంటనే కొనుగోలు చేసి, ఖాతాల్లో డబ్బులు జమ చేసి రైతు కళ్ళల్లో కన్నీళ్లు తుడవండి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించండి. చనిపోయిన రైతులకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబాలను ఆదుకోండి' అని సూచించారు.