తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దర్శించుకున్నారు. గురువారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే స్వామి వారికి నిర్వహించిన అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం టీటీడీ అధికారులు రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.