తెలంగాణలో ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసాను రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచామని పీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. రాష్టంలో తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలబడిందన్నారు. BRS ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసిందని, రూ.7 లక్షల కోట్ల అప్పులతో ఉన్న టైంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నామని, రూ.22 వేల కోట్లతో రుణమాఫీ చేశామన్నారు.