మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయన సీఎం పదవి చేపట్టడం ఇది మూడోసారి. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో గవర్నర్ రాధాకృష్ణన్.. ఫడ్నవీస్‌తో ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లు ప్రమాణం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, చంద్రబాబు తదితరులు హాజరయ్యారు.