అగ్నిగుండంలో పడి భక్తుడు మృతి (వీడియో)

70చూసినవారు
అగ్నిగుండంలో పడి భక్తుడు మరణించిన ఘటన తమిళనాడులో జరిగింది. రామనాథపురంలో జిల్లాలోని కుసవంకుడి గ్రామంలో సుబ్బయ్య ఆలయ ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా భక్తులు అగ్నిగుండంలో నడవడం ఆనవాయితీ. ఈ క్రమంలో కేశవన్‌ (56) అనే భక్తుడు అగ్నిగుండంలో నుంచి వెళ్తూ నిప్పులపై పడిపోయాడు. వెంటనే బయటికి తీసి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన ఏప్రిల్ 10న జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్