TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకొని ఇద్దరు మహిళలు పొట్టు పొట్టు కొట్టుకున్న ఘటన మరవక ముందే.. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం బస్టాండులో మరో గొడవ జరిగింది. స్వామివారి దేవస్థానం బస్టాండు ఆవరణలో బస్సు ఎక్కే సమయంలో భక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కాగా, గొడవకు కారణాలు తెలియాల్సి ఉంది.