ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలోని శ్రీవరాహలక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద భక్తులకు పెను ప్రమాదం తప్పింది. గిరిప్రదక్షిణ నేపథ్యంలో తొలిపావంచా వద్ద ఏర్పాటు చేసిన రేకుల షెడ్డు కూలింది. షెడ్డు కింద భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా అప్పన్న ఆలయంలో వరుస ప్రమాదాలతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.