ఉత్తరప్రదేశ్‌లోని మహాకుంభమేళాకు వెళ్లిన భక్తులకు కొత్త సమస్య వచ్చిపడింది. త్రివేణి సంగమంలో స్నానమాచరించిన తర్వాత అక్కడే ఉన్న బడే హనుమాన్ ఆలయాన్ని భక్తులు దర్శించుకుంటారు. అయితే ఆలయం బయట చెప్పులు విడిచిపెట్టి, దర్శనం చేసుకుని వచ్చేసరికి తమ చెప్పులను గుర్తించడం కష్టంగా మారిందని భక్తులు చెబుతున్నారు. గంటల తరబడి వెతికినా చెప్పులు దొరకలేదని మహిళలు మీడియాతో చెప్పారు.