శ్రీవారి దర్శనానికి వచ్చిన మధురై భక్తులు తిరుమల అతిథి గృహంలో బంగారు నగలు మర్చిపోయి వెళ్లారు. గదిని శుభ్రం చేస్తున్న సమయంలో సిబ్బంది గుర్తించి వెంటనే టీటీడీకి ఫోన్ చేసి చెప్పారు. స్పందించిన టీటీడీ భక్తుల వివరాలు కనుక్కుని.. వారికి ఫోన్ చేసి బంగారు నగలను టీటీడీ అధికారులు వారికి అప్పగించారు. నగలను గుర్తించిన సిబ్బందికి, వెంటనే స్పందించిన టీటీడీ అధికారులకు మధురై భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.