ధరణి పోర్టల్.. కేసీఆర్ కనిపెట్టింది కాదని సీఎం రేవంత్ అన్నారు. 'కాగ్ తప్పుబట్టిన ధరణిని తెలంగాణపై ఎందుకు రుద్దారు? 2010లోనే ఒడిశాలో ఈ-ధరణిని తీసుకువచ్చారు. కేసీఆర్ కూడా ధరణి అని పేరు పెట్టారు. ఒడిశా ప్రభుత్వం అప్పగించిన సంస్థకే ధరణిని కూడా అప్పగించారు. తన మెదడు రంగరించి ధరణిని చేశారన్న కేసీఆర్ మాటలు అబద్ధం. యువరాజు (కేటీఆర్) ముందు ఉండి.. వెనకాల ఇంకొకరిని పెట్టారు. ధరణిలో రకరకాల కంపెనీల వాటాలు ఉన్నాయి' అని వ్యాఖ్యానించారు.